EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హనుమకొండ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరం లో యోగా దినోత్సవం వేడుకలు

ఈ తరంభారతం  హన్మకొండ జూన్ 19 :2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హనుమకొండ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిర్ లో బహుమతి వితరణ.2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హనుమకొండ శ్రీ రామకృష్ణ ధ్యానమందిర్ లో నిర్వహించబడిన “సూర్య నమస్కార మారథాన్” పోటీలలో సీనియర్స్ నుండి విజేతలైన మాధవి, శ్వేత, శ్రీకళ ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపికయ్యారు అట్లే, జూనియర్స్ విభాగం నుండి నియతి, మరియు యశస్విని ప్రథమ, ద్వితీయ పురస్కారాలకు ఎన్నికయ్యారు.శ్రీ రామకృష్ణ సేవా సమితి పక్షాన అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి కె.వి.రావు, యోగా గురూజీ ఆంజనేయులువిజేతలను శాలువాతో సత్కరించి, ప్రోత్సాహక బహుమతులను అందజేసారు.

Related News

Select the Topic
Scroll to Top