ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జూలై 17 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మొదట కార్యాలయంలోకి వచ్చిన ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వారి డాక్యుమెంట్లను పరిశీలించి, వారిని బయటకు పంపించినట్లు తెలుస్తోంది. బయట వ్యక్తులను పూర్తిగా కార్యాలయం బయటకు పంపించి కార్యాలయ పనిచేసే సిబ్బందిని లోపల ఉంచినట్లు సమాచారం. పక్కా సమాచారంతో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.















