EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల తరలించలి

హైదరాబ్నాద్ జూలై 19 (ఈతరం భారతం);ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు కేలండర్ ను రూపొందించాలని, తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇల్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలకు సంబంధించి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు.సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు ఇల్లు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ శాఖల ఆదాయాల పెరుగుదలపై ఆయా శాఖలో ఉన్న అధికారులు సమావేశంలో నివేదిక సమర్పించారు. కమర్షియల్ టాక్స్ శాఖలో 1.8 శాతం, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలో 3.6 శాతం, గనుల శాఖలో 7శాతం ఆదాయం పెరుగుదల ఉన్నట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మెట్రోపాలిటన్ ఏరియా నగర అభివృద్ధి శాఖ సెక్రటరీ,ఇలంబర్తి, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్, గనుల శాఖ కమిషనర్ శశాంక, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, టిజిటిడిసి మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు

 

హైదరాబ్నాద్ జూలై 19 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ఓఆర్‌ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు కేలండర్ ను రూపొందించాలని, తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇల్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలకు సంబంధించి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు.సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు ఇల్లు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ శాఖల ఆదాయాల పెరుగుదలపై ఆయా శాఖలో ఉన్న అధికారులు సమావేశంలో నివేదిక సమర్పించారు. కమర్షియల్ టాక్స్ శాఖలో 1.8 శాతం, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలో 3.6 శాతం, గనుల శాఖలో 7శాతం ఆదాయం పెరుగుదల ఉన్నట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మెట్రోపాలిటన్ ఏరియా నగర అభివృద్ధి శాఖ సెక్రటరీ,ఇలంబర్తి, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్, గనుల శాఖ కమిషనర్ శశాంక, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, టిజిటిడిసి మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top