EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీదుర్గ భవాని మాత ఆశీర్వాదం పొందిన- శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి 

సదాశివపేట జూలై 20 (ఈతరం భారతం);సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆషాడ మాసం పునస్కరించుకొని శ్రీ దుర్గా భవాని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 140 కులాల వారిని కలుపుకొని ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి దుర్గ భవాని అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొంది అన్ని కులాల వారితో మమేకమై ఉత్సవ జాతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ee సందర్బంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ సదాశివపేట పట్టణ మరియు మండల ప్రజలు ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు.ఈ దుర్గా భవాని జాతర కార్యక్రమంలో భాగంగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అనాది కాలం నుండి, పూర్వీకుల నుండి మహిమగల అమ్మగా పేరుపొందిన శ్రీ దుర్గా భవాని మాత భక్తుల కోరికలు తీర్చటం మరియు అమ్మను నమ్ముకున్న భక్తులను కాపాడుకోవడం, సుఖ సంతోషాలుగా ఉండే విధంగా చూడడం సదాశివపేట పట్టణ శ్రీ దుర్గా భవాని మాత ఆలయం యొక్క ప్రత్యేకత అని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సదాశివపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ సాడాకుల కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరు( చిరంజీవి), కోవూరి శంకర్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ అరుణ్ కుమార్ , మాజీ కౌన్సిలర్ నాగరాజు గౌడ్ , మాజీ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం , మాజీ కౌన్సిలర్ గుండ్ల రవి, సదాశివపేట పట్టణ మరియు మండల నాయకులు సిద్ధన్న, రాములు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, మోట్లకుంట రవి, రాఘవేందర్, శ్రీకాంత్ గౌడ్, బిట్ల ప్రేమ్ కుమార్, తుకారం, ఎండి లతీఫ్, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top