EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తినే ఉపరాష్ట్రపతిగా నియమించాలి ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేసిన తెలంగాణ ఉద్యమకారుల కమిటీ

హైద్రాబాద్ జులై 24 (ఈతరం భారతం)తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తినే ఉపరాష్ట్రపతిగా నియమించాలని ప్రధాన మంత్రికి తెలంగాణ ఉద్యమకారుల కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు బండి రమేష్ గన్ ఫౌండ్రిలో మాట్లాడుతూ… తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, జాతీయ స్థాయిలో అత్యున్నత పదవుల్లో తమ ప్రాంతానికిప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఇలాంటి నిర్ణయం భారత దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించి, దేశ ఐక్యతను బలోపేతం చేస్తుందన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అభివృద్ధి కోసం అందించిన సేవలకు గౌరవంగా నిలుస్తుందన్నారు. తమ అభ్యర్థనను మన్నించి తెలంగాణ రాష్ట్రానికి అవకాశం కల్పిస్తారన్న ఆశాభావన్నీ వ్యక్తం చేసారు.

Related News

Select the Topic
Scroll to Top