హైదరాబాద్ జూలై 24 (ఈతరం భారతం);: కేంద్రంలో బీజేపీ సర్కార్ అండతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును ప్రారంభించిన ఏపీ సర్కార్.. తాజాగా నాగార్జున సాగర్ విషయంలోనే అలాగే వ్యవహరిస్తున్నది. చెప్పాపెట్టకుండా సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసుకున్నది. కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం సాయంత్రం నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నది.















