ఈతరం భారతం ఖమ్మం జూలై 25 :పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి సందేహిస్తున్న పరిస్థితుల్లో అందుకు భిన్నంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భార్యకు కూడా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించి కాన్పు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గర్భిణీ మహిళలు కాన్పు కోసం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యులను నమ్మి అధిక సంఖ్యలో ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన కాన్పు చేశారు వైద్యులు. మొదటి కాన్పులో సిజేరియన్ అయిన రామ్ నగర్ కు చెందిన అమూల్య రెండో కాన్పుకోసం ఆసుపత్రిలో చేరగా గైనకాలజిస్ట్ అనూష లక్ష్మీ ఆధ్వర్యంలో ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని గైనకాలజిస్ట్ అనూష లక్ష్మి తెలిపారు. గర్భిణీ మహిళ కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు















