ఈతరం భారతం ములుగు జిల్లా జూలై 27 :అధికారుల హెచ్చరికలు ఖాతారు చేయకుండా ఎవరైనా పర్యాటక ప్రాంతాలకు వచ్చి ఇబ్బందులు పడద్దని ములుగు జిల్లా వెంకటాపురం సిఐ బండారి కుమార్ తెలిపారు.శనివారం నాడు.ములుగు జిల్లా వెంకటాపురం మండలం మహితపురం గ్రామ సమీపంలోని జలపాతాన్ని చూడటానికి వరంగల్ NIT కి చెందిన ఏడుగురు విద్యార్థులు రాత్రి గూగుల్ మ్యాప్ ను అనుసరించి అడివిలో దారి తెలియక తప్పిపోయారు. శత విధాల ప్రయత్నించిన విద్యార్థులకు రాత్రిపూట అటవీదారులు కనిపించకపోవడంతో పాటు దాహం ఆకలితో అలమటించిన విద్యార్థులు డయల్ 100కు కాల్ చేయగా స్పందించిన వెంకటాపురం పోలీసులు, అటవీ శాఖ అధికారుల సాయంతో రెస్క్యూ చేసి అర్ధరాత్రి బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో అందున నక్సల్ సంచరించే అడవి ప్రాంతం కావడంతో ఏ క్షణంలో ఏం జరిగేది తెలిసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జలపాదల సందర్శనకు అనుమతులు లేవంటూ ఇదివరకే పోలీసులు హెచ్చరించారు అయినప్పటికీ NIIT కు చెందిన కొంతమంది విద్యార్థులు అటవీ మార్గాల ద్వారా మహితాపురం జలపాతానికి చేరుకొని తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు. అసలే మావోయిస్టులు సంచరించే కర్రే గుట్టలు ఉన్న ఈ ప్రాంతానికి ఎవరూ రా వద్దంటూ గతంలోనే నక్సల్స్ పలువురునీ హెచ్చరించారు.అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది స్థానిక గ్రామ ప్రజలు వంట చెరుకు నిమిత్తం ఈ ప్రాంతానికి వెళ్లడంతో నక్సల్స్ అమర్చిన ప్రెషర్ బాంబులు పేలి పలువురు గాయపడటం మరికొందరు మరణించడం తెలిసిన అయితే వర్షాలు భారీగా పడటంతో జలపాతాలకు జలకళ సంతరించుకుంది అనే విషయాలను గమనించిన కొంతమంది విద్యార్థులు ఎవరి సాయం లేకుండానే గూగుల్ మ్యాప్ సాయంతో జలపాతాలు సందర్శించారు అనంతరం తిరుగు ప్రయాణంలో దారి తప్పి పోయారు అనుమతులు లేకుండా ఎవరు ఈ ప్రాంతానికి రావద్దని హెచ్చరించినప్పటికీ ఇలా చేయడం సరికాదని వెంకటాపురం పోలీసులు అన్నారు ఇంకా ఎవరైనా ఇలా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సిఐ బండారి కుమార్ హెచ్చరించి తప్పిపోయిన విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు.















