EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అబ్దుల్ కలాం ఆశయాలు నెరవేరుస్తాం : CM రేవంత్

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 27 : క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్‌ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా ఆదివారంవేదికగా స్మరించుకున్నారు. ‘మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు. విజ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శకునిగా నిలిచిన కలాం తన జీవితం మొత్తాన్ని దేశసేవకు అంకితం చేసిన మహాత్ముడని ఆయన గుర్తుచేసుకున్నారు. కలాం ఆశయాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరు వారి విలువలు, ఆలోచనలను అనుసరిస్తూ స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top