ఈతరం భారతం హైదరాబాద్ జూలై 27 :తెలంగాణ స్థానిక ఎన్నికలపై మరో బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయితీ రాజ్ శాఖ ప్రతిపాదన చేసింది.అయితే గతంలో తెలంగాణ స్థానిక ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించగా… ఇప్పుడు మాత్రం రెండు దశల్లోనే పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల సంఘానికి పంచాయితీ రాజ్ శాఖ తెలియజేసింది. కాగా ఈ ప్రతిపాదపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం… దీనికి అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయాలని, బాక్సుల లభ్యత, కేటాయింపుల వివరాలను తమకు అందించాలని కోరింది.ప్రతి క్లస్టర్ పరిధిలో 10 శాతం బాక్సులు రిజర్వులో ఉంచాలని ఈసీ పేర్కొంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండగా… హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 30 లోగా ఎన్నికలు పూర్తీ చేసేందుకు కసరత్తులు మొదలయ్యాయి.















