హైదరాబాద్ జూలై 27 (ఈతరం భారతం);గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామచంద్రాపురంలో శ్రీ స్నేహ బి హెచ్ ఈ ఎల్ లేక్ వ్యూ రెసిడెన్సిలో “డాక్టర్ సునయన వైట్ అండ్ బ్రైట్ డెంటల్ క్లినిక్” వారు ఉచిత డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఆదివారము ఉదయం రెసిడెన్సి లోని పెద్దల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఉచిత డెంటల్ క్యాంప్ సాయంత్రం వరకు కొనసాగింది. డాక్టర్ వల్స సునయన MDS – Prosthodontist & Implantologist నేతృత్వంలో వైద్యుల బృందం అపార్ట్మెంట్ వాసులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి దంత సంరక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు . ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు మొదటి వందమందికి బ్రష్ పేస్టు తో కూడిన సెట్టును అందజేశారు. ఈ డెంటల్ క్యాంపులో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి దంత పరీక్షలు చేయించుకొని తమ రెసిడెన్సీలో ఉచిత డెంటల్ క్యాంప్ ఏర్పాటుచేసిన డాక్టర్ సునయన బృందాన్ని అభినందించారు. ఈ క్యాంపులో డాక్టర్ సునయనతో పాటు డాక్టర్ శ్రద్ధ, డాక్టర్ సింధు, డాక్టర్ సలేహా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది సరిత,రామా హరికృష్ణ , డాక్టర్ వలస పైడి, అపార్ట్మెంట్ పెద్దలు గుప్తా తదితరులు పాల్గొన్నారు.















