యాదగిరిగుట్ట,జూలై 27 (ఈతరం భారతం);: స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం… గెలుస్తాం… భేషైన పాలన అందిస్తాం.. ఒక్కసారి బిజెపి ని గెలిపిస్తే … ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాం… గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి పనులతో తీర్చి దిద్దుతాం అని కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు . యాదగిరిగుట్ట లో ఆదివారం మండల అధ్యక్షురాలు గుంటిపల్లి మహేశ్వరి అధ్యక్షతన జరిగిన బిజెపి యాదగిరిగుట్ట స్థానిక సంస్థల మండల కార్యశాల కు ముఖ్య అతిథిగా హాజరైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో, గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు, ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి , టిఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల్లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి బిజెపి పార్టీకి ఇవ్వమని కోరారు, కాంగ్రెస్ , టిఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని ,బిజెపి కి స్థానిక సంస్థల్లో పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం నడపడంలో విఫలమైందని అన్నారు. మండలంలో ఎంపీటీసీ, జడ్పిటిసి అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ,మెజార్టీ స్థానాలు గెలుస్తామని అన్నారు .పోటీ చేస్తున్న అభ్యర్థులను సమిష్టి కృషితో పనిచేసే గెలిపించాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చార., ఈ కార్యశాలలో స్థానిక సంస్థల కో_ కన్వీనర్ గంధమల్ల మహేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటుపల్లి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు కళ్ళెం శ్రీనివాస్ ,మండల ప్రధాన కార్యదర్శి గోపగాని ప్రసాద్ గౌడ్ , దొంత భరత్,మండల ఉపాధ్యక్షులు ఏలూరి సత్యనారాయణ, కొత్తపల్లి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బూరు వీరస్వామి ,మండల కోశాధికారి షారాజీ లక్ష్మయ్య ,మండల కార్యదర్శి చింతల సునీత ,బూత్ అధ్యక్షులు మంగ మహేందర్, కర్రె మహేందర్, కర్రె శ్రీకాంత్,పల్లెపాటి బాలయ్య, కంకల సిద్దులు,గుజ్జ ఉపేందర్, నగేష్, స్వామి, భాను ,చింతల శ్యామ్, రాజు తదితరులు పాల్గొన్నారు.















