నల్లగొండ జూలై 27 (ఈతరం భారతం);ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కొడుకునే కాదనుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మహిళ.. ఐదేళ్ల కుమారుడిని అనాథగా బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. బిక్కుబిక్కుమంటూ బస్టాండ్లో ఏడుస్తూ కూర్చున్న చిన్నారిని స్థానికులు గమనించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ బస్టాండ్లో ఈ దారుణం జరిగింది.















