హైదరాబాద్ జూలై 28 (ఈతరం భారతం);హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్పూర్తి స్థలంలో బీసీలకు పెట్రోల్ బంకుల లైసెన్సుల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయించిన దార్శనిక నాయకుడు స్వర్గీయ జైపాల్ రెడ్డి స్మారకానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు సోమవారం ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డా. వకుళాభరణం మాట్లాడుతూ — “మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సాధించడంలో జనతాదళ జాతీయాధికార ప్రతినిధిగా జైపాల్ రెడ్డి నిబద్ధతగా పోరాడారు. రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా బీసీల పక్షాన ఆయన ఇచ్చిన మద్దతు చరిత్రలో నిలిచిపోతుంది. వెనుకబడిన వర్గాల సాధికారతకు ఆయన చేసిన కృషి ప్రతి నాయకుడికి స్ఫూర్తిదాయకం” అని అన్నారు.















