EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇది కేవలం ఒక ఆవిర్భావ దినోత్సవం కాదు. ఇది ఒక ఉద్యమానికి అంకురార్పణ : యర్రమాద వెంకన్న నేత వ్యవస్థాపకులు, చేనేత దినోత్సవం

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 30

ఒక ఉద్యమ యాత్రకు ఆహ్వానం

(బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా)

“ఇది కేవలం ఒక ఆవిర్భావ దినోత్సవం కాదు. ఇది ఒక ఉద్యమానికి అంకురార్పణ. బహుజనుల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికార సాధన కోసం మేధస్సుతో నడిచే ప్రజా ఉద్యమానికి ఇది తొలి ఏడాది”

రాజకీయాలు వ్యాపారత్మకంగా మారిన ఈ యుగంలో, సామాన్యుల హక్కులు మర్చిపోయిన ఈ కాలంలో, ఒక వ్యక్తి పదవీ విరమణ తర్వాత విశ్రాంతికి వెళ్లకుండా, ప్రజల మట్టివాసన గుర్తు చేసుకుని ఉద్యమ పంథా ఎంచుకోవడం ఒక విలక్షణమైన ఘటన.టి. చిరంజీవులు గారు రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్ అధికారిగా అత్యున్నత సేవలందించి, పదవీ విరమణ అనంతరం ‘బీసీ ఇంటలెక్చువల్ ఫోరం’ పేరుతో ఒక అభ్యుదయవాద సంస్థను స్థాపించి, కేవలం భావోద్వేగాలతో కాదు, గణాంకాలతో, డేటా ఆధారంగా బీసీ హక్కుల కోసం చర్చను తెచ్చారు. ఆయన చేపట్టిన ఈ ప్రయాణం నేడు బీసీ వర్గాలలో ఒక ఆశాజ్యోతి, దిశానిర్దేశంగా నిలిచింది.

ఈ ఫోరం చేసిన విశిష్ట కృషి

రెండు దశాబ్దాల బీసీ పాలనా డేటాను విశ్లేషించి, బీసీల పాలనా భాగస్వామ్యంలో అసమానతలను ప్రభుత్వానికి చూపించడం. 42% బీసీ రిజర్వేషన్ అమలుకు శాస్త్రీయ, చరిత్రాత్మక, రాజ్యాంగపరమైన ఆధారాలతో వివరణ ఇచ్చే పేపర్లు సిద్ధం చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా సదస్సులు, సమ్మేళనాలు నిర్వహించడం. ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులకు, నైతిక మద్దతుదారులకు ఈ సమస్య ప్రాధాన్యతను తెలియజేయడం. ప్రభుత్వ విధానాలలో బీసీల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ రూపొందించడం.బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చేస్తున్నది ఒక సంపూర్ణ మార్పు రాజకీయానికి నాంది. ఇది అధికార ఆశయంతో కూడిన ఉద్యమం కాదు. ఇది ఓ సామూహిక చైతన్యాన్ని నిర్మించేందుకు, ఓ మేధస్సుతో కూడిన ప్రజాస్వామ్య యాత్ర ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నం. ఇది మనమంతా కలసి నిర్మించాల్సిన ప్రస్థానం.

ఈ ఉద్యమం మనను మనమే తెలుసుకునే ప్రయత్నం. మన కులచరిత్రను, శ్రమను, అభివృద్ధికి ఇచ్చిన మా నిస్వార్థ సేవలను గుర్తించి, ప్రజా రాజ్యాధికారంలో బీసీలకు తగిన స్థానం కల్పించాలని కోరే న్యాయబద్ధమైన గళం. ఇది కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది లక్షలాది బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, శ్రమజీవుల ఆకాంక్ష.ఒక ఉద్యమం ఎంత మానసిక శ్రమతో నిర్మితమవుతుందో, ఎంత సంకల్ప బలంతో నడుస్తుందో ఈ ఫోరం ఉదాహరణ. అది తాత్కాలిక జోష్‌తో కూడిన నినాదం కాదు, స్థిరమైన లక్ష్యం. బహుజనుల పరిపాలనలో బీసీల రాజ్యాధికారం అనేది హక్కు, దయాదాక్షిణ్యం కాదు అని స్పష్టం చేసింది.ఈ ఆవిర్భావ దినోత్సవం, మనందరికీ ఒక పిలుపు. మన శక్తిని మేధస్సుగా, మన మేధస్సును ఉద్యమంగా మార్చుకుందాం. వర్గీయ చైతన్యం రాజకీయ చైతన్యంగా మారాలి. మన మనుగడ కోసం మనమే ముందుకు రాలేకపోతే, మరెవరు వస్తారు?

మార్పు ఎప్పుడూ పై నుండి రాదు. మార్పు క్రిందనుండి కలుస్తుంది. ఈ క్రిందనుండే మార్పుకు నాంది ఈ ఉద్యమం. ఇది బీసీల అధికార యాత్ర ప్రారంభం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి పెట్టిన బహుజన వేదిక. ఇప్పుడు మనందరం ఒకటే నినాదంతో ముందుకు సాగాలి.

యర్రమాద వెంకన్న నేత. వ్యవస్థాపకులు, చేనేత దినోత్సవం

Related News

Select the Topic
Scroll to Top