31.07.2025 ఈ తరంభారతం పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం :
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు,శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన వారు
ఎం.ముత్తయ్య (ASI),డి.లచ్చు (ASI),డి.మోహనరావు(ARSI) ,కె. సైదయ్య (హెడ్ కానిస్టేబుల్ ), SD. మన్సూర్ (హెడ్ కానిస్టేబుల్ ), ఎన్.బాలకృష్ణ (AR హెడ్ కానిస్టేబుల్ ),కె. వెంకయ్య( హెడ్ కానిస్టేబుల్ ), కె. ఆనందరావు (హెడ్ కానిస్టేబుల్ ) .
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా& ఆర్డర్ ప్రసాద్ రావు, AR ACP నర్సయ్య, RI కామరాజు, సురేష్, నాగులమీరా, పోలీస్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.















