EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణను ఖండించండి  – పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ 

ఈతరం భారతం ఖమ్మం జూలై 31 :: ఇజ్రాయిల్ యుద్ధం చేయాలనే కాంక్షను విడనాడాలని పెవిలియన్ గ్రౌండ్ సీనియర్ నడక సాదకులు కోరారు. గురువారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ సీనియర్ నడక సాదకులు ఉదయం సమయాన నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇజ్రాయిల్దాడుల మూలంగా పాలస్తీనాలోని గాజాలో ప్రజలకు నీరు, ఆహారం, మందులు, నిత్యావసర వస్తువులు అందడం లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులను సైతం ధ్వంసం చేస్తున్నారని ఇరవై లక్షల మందికి పైగా ప్రజలు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని వారు తెలిపారు. పాలస్తీనా ప్రజలకుమద్దతుగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ సీనియర్ నడక సాదకులు ఈరోజు ఈవిధంగా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెవిలియన్ గ్రౌండ్ సీనియర్ నడక సాదకులు మంద వెంకటేశ్వర్లు, రావూరి శ్రీనివాస్, గంగవరపు వీరభద్రం, కొండమీద వెంకట్, గాదె లక్ష్మినారాయణ, పాటి శ్రీనివాస్, సత్తేందర్, గ్రానైట్ భాస్కర్, హరిబాబు, దామోదర్ రెడ్డి, శంఖర్, గోళ్ళ రాంబాబు, వెంకటనారాయణ, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top