హైదరాబాద్, జూలై 31, (ఈతరంభరతం );సెప్టెంబర్‌లో ముంబయిలో జరగనున్న మహా కుంభ్ మేళాకు ముందస్తు కార్యక్రమంగా “స్టీల్ మహాకుంభ్ రోడ్‌షో” హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నిపుణులు, కీలక స్టేక్‌హోల్డర్లు, మరియు నాయకులు పాల్గొని, అభివృద్ధి చెందుతున్న భారత్‌లో స్టీల్ రంగ భవిష్యత్తుపై చర్చించారు.ఈ రోడ్‌షోను తెలంగాణ ఐరన్ & స్టీల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సస్టెయినబుల్ స్టీల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, స్టీల్ మంత్రిత్వశాఖ మరియు UNDP సహకారంతో నిర్వహించారు. కార్యక్రమం గ్రీన్ స్టీల్, ఎనర్జీ ఎఫిషియెన్సీ, మరియు మార్కెట్ అవుట్‌లుక్ వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించింది.AIIFA అధ్యక్షులు యోగేష్ మండ్హానీ మాట్లాడుతూ, మహా కుంభ్ మేళా సందర్భాన్ని ముందుకు తీసుకెళ్తూ, బలమైన మౌలిక వసతుల నిర్మాణానికి స్టీల్ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. పరిశ్రమ పర్యావరణ అనుకూలతను సాధించడంలో ముందడుగు వేయాలన్నారు.ప్రాజెక్ట్ చైర్మన్ ప్రకాష్ గోయెంకా మాట్లాడుతూ, రోడ్‌షో యొక్క ప్రధాన ఉద్దేశ్యం జ్ఞాన మార్పిడి మరియు ఉత్తమ ఆచరణలను ప్రోత్సహించడమేనన్నారు. “మా లక్ష్యం పచ్చని మరియు సమర్థవంతమైన స్టీల్ పర్యావరణాన్ని నిర్మించడమే,” అన్నారు.BIS ముసాయిదా ప్రమాణాలపై మాట్లాడుతూ, “AIIFA జోక్యం వల్ల ఈ ముసాయిదా తాత్కాలికంగా నిలిపివేయబడింది,” అన్నారు. భారతదేశం యొక్క ప్రత్యేక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా — ఉష్ణమండల వాతావరణం, సముద్రతీర ప్రాంతాలు, మరియు అధిక ఫాస్ఫరస్ కలిగిన ఐరన్ ఓర్‌ను దృష్టిలో ఉంచుకొని BIS ప్రమాణాలను సవరించాలని BISను కోరారు.















