ఈతరం భారతం హైదరాబాద్, ఆగస్టు 1: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025 – 26 విద్యా సంవత్సరంలో నిర్వహిస్తున్న యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 13 తుది గడువు అని అంబేద్కర్ కౌన్సిలర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దునుకు వేలాద్రి శుక్రవారం చెప్పారు. అన్ని రకాల విద్యా సౌకర్యాలను అందిస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సుల్లో చేరడం ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను పొందాలని ఆయన సూచించారు. అన్ని వయసుల వారు విద్యా అవకాశాలు పొందే వీలు అంబేద్కర్ యూనివర్సిటీలో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు. విద్యతో పాటు ఉపాధి అవకాశ మార్గాలను జాబ్ మేళా వంటి కార్యక్రమాల ద్వారా కోర్సులలో చేరిన విద్యార్థులకు యూనివర్సిటీ అందిస్తున్నదని ఆయన తెలిపారు. యూనివర్సిటీ అందిస్తున్న ఈ సదవకాశాన్ని వినియోగించుకొని యుజీ,పిజీ కోర్సులలో చేరాలని ఆయన చెప్పారు. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు పొందిన విద్యార్థులు ఎందరో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటమే కాకుండా, అత్యున్నత స్థాయిలో అవకాశాలను పొందారని ఆయన తెలిపారు.















