హైదరాబాద్ ఆగష్టు 1 (ఈతరం భారతం););ఫీజుల చెల్లించకుండా ఫీజుల స్కీములు ఎత్తివేయడానికి ‘ట్రస్ట్ బ్యాంకు’ ఏర్పాటు చేసే యోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు చెల్లించాలని క్విజ్‌ల కోసం ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటును నిర్మించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ ధర్నా ను నిర్వహించారు.బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ నాయకత్వం వహించారు. సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకయి 6000 కోట్లపైనే ఉందని వీటిని వెంటనే చెల్లించాలనిలు, అలాగే 100 బీసీ కాలేజ్ హాస్టల్ లో మంజూరు చేయాలని 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని బీసీ గ్రూప్ గురుకుల పాఠశాలలో 20 శాతం సీటు పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమైన స్కాలర్షిప్ విలువ కాయలు స్కీమును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగతన్నారు. విద్యా రాజ్యాంగ బద్ధమైన హక్కు అని ఎస్సీ ఎస్టీ బీసీలకు అభివృద్ధికి ఉపయోగపడే ఈ స్కీమును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నేరుగా వస్తుందని ఆర్ కృష్ణయ్య విమర్శించారు అనేక స్క్రీన్ లకు లక్షల కోట్ల అప్పులు తెస్తున్న ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకం కు 6000 కోట్లు అప్పు చేస్తే ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ఈ పథకం కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెల కాలంలో 20 రూపాయలు కూడా విడుదల చేయలేదని అన్నారు ఈ పథకం అమలుకు ఏటా నాలుగు శాఖల ద్వారా బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించాలని అయినా కూడా ఒక రూపాయి కూడా విడుదల చేయకుండా అవి ల్యాబ్స్ అయినాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఈ పథకం కింద వేరే కోట్ల రూపాయలు కేటాయిస్తుందని వీటిని ఏం చేస్తున్నారని కృష్ణయ్య ప్రశ్నించారు .పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జపాలుగా 1500 కోట్లు విడుదల చేశారని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజులు స్కాలర్షిప్లు ఫిర్యాదు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం మారుతుందని ఆయన తీర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ స్కీమును అమలు చేయకపోవడం వల్ల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెత్తిమీద పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని కృష్ణయ్య దుయ్యబట్టారు. ఈ స్కీం పెట్టిన తర్వాత గ్రామాల్లో వ్యవసాయ కూలీలు పిల్లలు కూలీల పిల్లలు మెడిసిన్ ఇంజనీరింగ్ పీజీ డిగ్రీలు చదువుతున్నారు అన్నారు సమాజంలో గునాత్మకమైన మార్పు ప్రారంభమైందని చైల్డ్ లేబర్ అరికట్టబడిందని ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను చదువుకుంటున్నారన్నారు. ఈ గుణాత్మక మార్పును చదువుకోకుండా ప్రభుత్వము అడ్డుకుంటుందని కృష్ణయ్య విమర్శించారు.ఈ కార్యక్రమం లో సిపిఐ జాతీయ నాయకులు కే నారాయణ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, గుజ్జ సత్యం,వకులాబారణం కృష్ణమోహన్ రావు, నీల వెంకటేష్, పగుడాల సుధాకర్, నందకిషోర్, రాందేవ్, చంద్రశేఖర్, ప్రసాద్, మనీష్, శివ యాదవ్, నరేష్ గౌడ్, శివ ముదిరాజ్, తిరుమలేష్, రజాక్ తదితరులు పాల్గొన్నారు















