EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వున్నం వారి వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ నామ

ఈ తరం భారతం భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి వున్నం వారి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తన సతీమణి శ్రీమతి చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రియాంక – అనుదీప్ దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో నడవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు నామ సోదరులు రామారావు, సీతయ్య, కృష్ణయ్య దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కమ్మ శ్రీను, మారెడ్డి సీతారామయ్య, నాగేశ్వరరావు, నామ భవ్యతేజ, సాయిరాం తదితరులు హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top