ఈతరంభారతం హైదరాబాద్ ఆగస్టు 4 :ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మేరమా యాడి లంబాడా జాతి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజలతో మొదలైన కార్యక్రమం ఉదయం కడావు భక్తిశ్రద్ధలతో హోమం మధ్యాహ్నం మేరమయాడి పూజ సాయంత్రం “తీజ్” గిరిజన లంబాడి కుటుంబంలో ఉన్న పెళ్లి కానీ అమ్మాయిలతో నవరాత్రులు గోధుమలు మరియు శనగల నారు పెంచి తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారు ఈ కార్యక్రమం పాడి పశువులు చల్లగా ఉండాలని పంటలు బాగా పండాలని పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడు మంచివాడు వరుడు రావాలని తొమ్మిది రోజులు ఉపాసదీక్షలతో కటోర భక్తి శబ్దలతో జరుపుకొంటారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తండాలో ఘనంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఖమ్మం నడిబొడ్డున సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం పాండురంగాపురం నందు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్, టి జి టి టి ఎఫ్ వ్యవస్థాపద్యక్షులు రామారావు జాతీ ఐక్యత కోసం ప్రతి ఒక్క లంబాడి బిడ్డ కృషి చేయాలని భవిష్యత్ తరాల కోసం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం అని ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకులు హతి రాం నాయక్ ,గంగావతు రమేష్, గౌరవ అధ్యక్షులు చక్రవర్తి నాయక్, అధ్యక్షులు బాల్ సింగ్, ప్రధాన కార్యదర్శి భూక్య మంగ్య నాయక్, కోశాధికారి మంగీలాల్ జాదవ్, కార్యదర్శులు భూక్య శ్రీరామ్ నాయక్, నాగు నాయక్, పాపా లాల్ నాయక్, రాము ల చిరాం నాయక్, మాలోత్ రమేష్ నాయక్ , దేవా సింగ్ నాయక్, సీతారాములు ,బాలాజీ టంకు నాయక్ ,శ్రీనివాస్ కిషన్ రాథోడ్, శ్యామ్ లాల్, బన్సీలాల్, రాందాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.















