EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సోషల్ మీడియా జర్నలిస్టులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు

హైదరాబాద్, ఆగస్టు 4 (ఈతరం భారతం); : ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి శక్తి వంచన లేకుండా పని చేస్తూనే ఉందని, నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ …ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే అవుతుందని, ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించబోదని ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top