ఈతరంభారతం ఖమ్మం ఆగస్టు 5 :స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు )రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా క్యూబా పట్ల అమెరికాన్ ఆంక్షలు వ్యతిరేకిస్తూ క్యూబా సంఘీభావనిధి సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఖమ్మం డిపో అధ్యక్షులు గడ్డం వెంకటయ్య ఆధ్వర్యంలో ఖమ్మం డిపో వద్ద ప్రారంభించారు. అంతర్జాతీయ సౌహార్ధతను కలిగిన చిన్న దేశం క్యూబా పట్ల అమెరికా తన ఆంక్షలు విడనాడాలని క్యూబా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నట్లు, ఆర్టీసీ కార్మికులందరూ సంఘీభావం నిధి అందించి అంతర్జాతీయ సంఘీభావాన్ని ప్రదర్శించాలని యూనియన్ నాయకులు కోరారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు గుండు మాధవ రావు, మహిళా కన్వీనర్ సరిత, ఉపాధ్యక్షులు వి.రమేష్, ఖమ్మం డిపో అధ్యక్షులు గడ్డం వెంకటయ్య, ఉపాధ్యక్షులు బుగ్గ వీటి లింగమూర్తి, కార్యదర్శి రోశయ్య, సహాయ కార్యదర్శి వి.సురేష్ , మహిళా కన్వీనర్ రామలక్ష్మి, రాధిక,డీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు.















