EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తిరుమలాయపాలెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ప్రకృతి వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఈతరం భారతం ఖమ్మం, ఆగస్టు – 05 :ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం అందుబాటులో ఉండేలాగా వైద్యులు, సిబ్బంది బాధ్యతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రకృతి వైద్యశాల, సామాజిక ఆర్యోగ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి సేవలు, ఐపీ సేవలు, మెడికల్ ఫార్మసి, ఎమర్జెన్సీ ఓ.టి, క్యాజువాల్టీ, ఇన్ పేషంట్, పురుషుల వార్డు, ప్రసవ గది, ఇసిజి రూమ్, ల్యాబ్ శాంపిల్ గది, ఫీవర్ రిజిస్టర్ పరిశీలించారు. పేషంట్ల వార్డుల కిటికీలకు పరదాలు పెట్టాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు.

ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి నేరుగా గర్భిణీ మహిళలు, పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యాధికారులు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. రోజుకు ఎన్ని ఓ.పి. లను చూస్తున్నది, గర్బిణిలకు ప్రత్యేక సేవలు, సాధారణ కాన్పులకు ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండాలని, ఆరోగ్య కేంద్రం ఆవరణంలో పేషంట్ల గదులు శుభ్రంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ తెలిపారు.ఆరోగ్య కేంద్రంలోని చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం, ఆవరణంలో పిచ్చి మొక్కలు, చెత్త లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రజలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. సాధారణ ప్రసవాలు జరిగేలా ఆశా సిబ్బంది గ్రామాలలో పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా కేసులు తప్పనిసరిగా ప్రత్యేక వైద్య అందించేలాగా చూడాలని తెలిపారు.డెంగ్యూ, మల్లేరియా కేసు వచ్చినా పరిసర ప్రాంతాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.

ఆసుపత్రిలో అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. ప్రభుత్వ వైద్య కేంద్రాలపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యతతో పాటు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరమని కలెక్టర్ అన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి కావలసిన వైద్య పరికరాలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై నివేదికల సమర్పించాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ తనిఖీ సందర్భంగా వైద్యాధికారులు డా. కృపా ఉషశ్రీ, డా. శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, తిరుమలాయపాలెం మండల ఎంపిడివో సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, వైద్యధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related News

Select the Topic
Scroll to Top