ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 5 :నిన్న మధిర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒరిస్సా రాష్ట్రం సీలేరు ఏరియా పుష్ప లంక గ్రామం నుండి గంజాయిని తీసుకొని వచ్చి మధిరలో మరియు చుట్టుపక్కల వినియోగదారులకు అమ్ముటకు సిద్ధంగా ఉంచినారనే నమ్మదగిన సమాచారంపై మధిర టౌన్ ఎస్ఐ ఎం కిషోర్ కుమార్ గారు పోలీస్ స్టేషన్ సిబ్బంది తో రక్కి నిర్వహించి గంజాయిని అమ్ముటకు తీసుకొని వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అయిన భూక్య అనూష్ నాయక్, కుంచం గోపీచంద్, మరియు ఒక మైనర్ బాలుడిని, సుమారు రెండు లక్షల రూపాయల విలువగల నాలుగు కేజీల గంజాయితో సహా పట్టుకొని పంచానామాయుక్తముగా పిఎస్ కు తీసుకొని వచ్చి వారిపై తగు చర్య కొరకు ఫిర్యాదు ఇవ్వగా మధిర టౌన్ పిఎస్ ఇన్స్పెక్టర్ గారు అయినా డి రమేష్ గారు కేసు నమోదు చేసి విచారణ అనంతరం సదరు వ్యక్తులను రిమాండ్కు పంపనైనది.















