హైదరాబాద్ ఆగష్టు 5 (ఈ తరం భారతం);రిహద్దు భద్రతా దళం (BSF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 3588 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 3406 పోస్టులు, మహిళలకు 182 పోస్టులు కేటాయించింది. అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in, bsf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఆగస్టు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు చేసి ఉంటే ఆగస్టు 24 నుంచి 26 వరకు సవరణలు చేసుకోవచ్చు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (PET), రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.















