ఇతర భారతం హైదరాబాద్ ఆగస్టు 6 :సినీ కార్మికుల వేతనాల వివాదంపై నటుడు చిరంజీవితో నిర్మాతల సమావేశం ముగిసింది.సి.కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవిశంకర్, సుప్రియ యార్లగడ్డ హాజరయ్యారు.సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. షూటింగ్లు ఆపడం సరికాదని చిరంజీవికి వివరించామన్నారు.రెండు మూడు రోజులు వేచి చూసి, పరిస్థితి చక్కబడకపోతే తాను జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చారని తెలిపారు.















