EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా, రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొపెసర్ జయశంకర్

హైదరాబాద్ ఆగస్టు 6 (ఈతరం భారతం);తెలంగాణ జాతిపిత ప్రొపెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ బండి రమేశ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్, ప్రొఫెసర్ జయశంకర్ స్పోర్ట్స్ స్టేడియం, లాలాపేట్ (పాత రామ్ సినిమా థియేటర్ ఎదురుగా), జయశంకర్ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ బండి రమేశ్,మాట్లాడుతూ ” తెలంగాణ ఉద్యమానికి మేధో ప్రేరణగా , తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొపెసర్ జయశంకర్ గారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసారని వివరించారు. మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు అని గర్జించిన ధీశాలి ఆయన అని తెలిపారు. తెలంగాణ ఆవశ్యకతను యువతకు అర్ధం అయ్యేలా రచనలు చేసి , రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిగా నిలిచారని చెప్పారు. జయశంకర్ గారి జీవితం నేటి యువతకు ఆదర్శమని బండి రమేశ్,తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వారి సేవలను గుర్తించి, వారి పేరుని భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ యూనివర్సిటికీ పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు .ee కార్యక్రమమ లో ఎం.బి. కృష్ణ యాదవ్, అధ్యక్షుడు, టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు.భామాచారి, మహేష్, వేణుగోపాల్ రెడ్డి, కిరణ, సునిల్,తెలంగాణ ఉద్యమకారుల కమిటీకి చెందిన క్రియాశీల సభ్యులందరూ పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top