ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 6 : కూసుమంచి పోలీస్ స్టేషన్:
తేదీ. 06.08.2025 న ఉదయం కూసుమంచి నుండి నాను తండా వెళ్ళు రోడ్డు శివాలయం దగ్గర వాహనములు తనికి చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు మూడు మోటార్ సైకిల్ పైన ప్లాస్టిక్ బస్తాలతో వస్తూ మమ్మల్ని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా, మాకు అనుమానం వచ్చి వారిని పట్టుకొని విచారించగా కరెంటు మోటార్లు మరియు వాహనం టైర్లు దొంగతనం ఒప్పుకొనగా ఈశ్వరమాదారంలో దొంగతనం చేసిన 5 కరెంటు మోటార్లు మరియు హట్యా తండ పరిదిలోని పాలేరు చిన్న కాలువ మీద దొంగతనం చేసిన 7 కరెంటు మోటార్లు ఒప్పుకోనగా వారి వద్ద నుండి 14 KG ల కాపర్ వైర్, 7 కరెంటు మోటార్లు, 3 టైరులు మరియు వారు దొంగతనంకు ఉపయోగించిన 3 మోటార్ సైకిల్ స్వాదిన పర్చుకొని అట్టి వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపనైనది.
కరెంటు మోటార్లు మరియు వాహనం టైర్లు దొంగతనం నిందితుల వివరాలు:
1). పుట్ట నరేష్ @ శ్రీను s/o రాములు, 27సం.లు, కులం: ముదిరాజ్, కూలి R/o వెంకటాపురం పోచారం, కూసుమంచి మండలం
2). యాట రాజు S/O అంజయ్య, 24సం.లు, కులం: ముదిరాజ్, కూలి, R/o వెంకటాపురం పోచారం, కూసుమంచి మండలం
టైర్లు దొంగతనం నిందితుడు వివరాలు
3).నిమ్మల రమేష్ S/o వెంకన్న,40సం., ముదిరాజ్, కూలి R/o వెంకటాపురం పోచారం, కూసుమంచి మండలం















