ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 6 :సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు యోధుడని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకుడన్నారు. పల్లె ప్రజల అభివృద్ధి కోసం పట్టుదలతో పనిచేసిన నాయకుడు అయోధ్య అని ఆయన మృతి వామపక్ష రాజకీయాలకు, ముఖ్యంగా సీపీఐ పార్టీకి తీరనిలోటు అని పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన బొల్లోజు అయోధ్య ప్రజల మదిలో నిలిచిపోయే నాయకుడని నామ అన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరంగా పోరాడిన నాయకుడని కొనియాడారు. అయోధ్య కుటుంబ సభ్యులకు, సీపీఐ నాయకత్వానికి తన ప్రగాఢ సానుభూతిని నామ తెలియజేశారు.















