ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 8 : TG: RTC బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఫొటోతో పాటు తెలంగాణ చిరునామా కార్డుపై అప్డేట్ అయి ఉండాలని పేర్కొన్నారు. ఇటీవల నిర్మల్(D) భైంసా నుంచి NZB వెళ్తున్న బస్సులో కొందరు మహిళలు ఉమ్మడి AP ఆధార్ కార్డు చూపించగా జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. దీంతో మహిళలు ఆగ్రహించిన సంగతి తెలిసిందే.















