తిరుమలాయపాలెం 8 ఆగస్ట్ ఈతరం భారతం : తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో పెట్రోల్ బంక్ లో బానోతు రవి పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ తీసుకొని ఇంటికెళ్లి తన బండిలో పోసి స్టార్ట్ చేయగా ఎంతసేపు చేసినా బండి స్టార్ట్ కాకపోవడం, పెట్రోలు చూస్తే మొత్తం వాటర్ కలిసి ఉండడంతో అవాక్కయ్యారు, వెంటనే బంకు దగ్గరకు వెళ్లి ఏంటి ఇలా ఉంది పెట్రోల్ అని పెట్రోల్ బంకు వారిని అడగ్గా వారు మీ ఇష్టం వచ్చింది చేసుకోకండి అని చెప్పి, అన్నారని కస్టమర్ వాపోతున్నారు,
ఇలాంటి వారికి ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు, అని చుట్టుపక్కల గ్రామ ప్రజలు అంటున్నారు, ఇలాంటి బంకులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అంటున్నారు, సంబంధిత అధికారుల స్పందించి వెంటనే ఈ బంక్ పై చర్యలు తీసుకోవాలని ,మండలంలో ఉన్న వివిధ బంకులలో సుబ్లేడు లో ఉన్న బంక్ కి రూఫ్ సీలింగ్ లేదు , వాటర్ సదుపాయం సరిగా లేకపోవడం, వాహనదారులకి గాలి సౌకర్యాలు లేకపోవడం, టాయిలెట్ సౌకర్యం లేకపోవడం, ఈ బంకులలో ఒకరోజు పెట్రోల్ ఉంటే ఒక రోజు ఉండదు, ఇష్టాన్ని తీరుగా నడుపుతున్న యజమాన్యం, పిండిప్రోలు గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకులు టర్నింగ్ దగ్గరలో ఉండటం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయి, వాహనాధారులు ఒకసారిగా బంకుల నుంచి బయటికి రావడం వలన టర్నింగ్ కావడంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి, సరైన సదుపాయాలు లేకపోవడం గమనహర్థం, ఇలాంటి బంకులు పై చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారుల ను కోరుకుంటున్నారూ, దగ్గర్లో ఉన్న ప్రజలందరూ వాపోతున్నారు, ఒకసారి మండలంలో ఉన్న బంకులను చెక్ చేసి, కల్తీ పెట్రోల్ వాడుతున్నారో వాడట్లేదు చూడాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని, మండలంలోని ప్రజలు వాపోతున్నారు,పెట్రోల్ బంకుల దగ్గర వాహనా దారులు లారీ లను బంకుల దగ్గర ఆపి నిద్రిస్తున్న టైం లో రాత్రి వేళలో డీజిల్ దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి,















