EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆగస్టు 12న జాబ్ మేళా నిర్వహణ …. జిల్లా ఉపాధి అధికారిణి మాధవి

ఈతరం భారతం  ఖమ్మం, ఆగస్టు -08 :జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు అపోలో హోమ్ కేర్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఆగస్టు 12న మంగళవారం ఉదయం 10.00 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ., టేకులపల్లి) ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్. మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అపోలో హోమ్ కేర్ లో *హోమ్ కేర్ నర్సులు* (30) ఖాళీలకు గాను జిడిఏ., ఎంపిహెచ్ డబ్ల్యూ., డిపిహెచ్ఎంఏ., జిఎన్ఎం. అర్హత గల వారు, *నర్సింగ్ సూపర్వైజర్* (2) ఖాళీలకు గాను జిఎన్ఎం., పీబిఎస్సి., బీఎస్సీ/ఎంఎస్సీ నర్సింగ్ అర్హత గల వారు, *బయో మెడికల్ ఎగ్జిక్యూటివ్* (2) ఖాళీలకు గాను బీటెక్ బయో మెడికల్ అర్హత గల 18 నుండి 30 సంవత్సరాల యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని, ఇట్టి ఉద్యోగ ఖాళీలు ఖమ్మంలో ఉన్నాయని, ఎంపికైన వారికి వేతనం 25 వేల నుండి 42 వేల వరకు ఉంటుందని తెలిపారు.మొత్తం 34 ఉద్యోగాల భర్తీకి గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారిణి ఆ ప్రకటనలో తెలిపారు.

 

Related News

Select the Topic
Scroll to Top