ఈతరం భారతం 09.08.2025 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్వహణను పరిశీలించెందుకు ఆకస్మికంగా సందర్శించిన పోలీస్ కమిషనర్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి, ట్రాఫిక్ నిర్వహణలో ఉన్న సవాళ్లను మరియు అవకాశాలను గురించి చర్చించారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి మరియు ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి కృషి చేయాలని,ఎంఫోర్సమెంట్ పై దృష్టి పెట్టాలని అదేశించారు.సిసిటివి కెమెరాల విస్తరణ, ట్రాఫిక్ సమస్య, సంఘటన సమయంలో ప్రతిస్పందన, జరిమానాల వసూలు, ట్రాఫిక్ పరికరాలపై సమీక్ష జరిపారు.
అదేవిదంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వ్యక్తిగత సంస్థలు మరియు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో సరైన పార్కింగ్ స్థలాలను గుర్తించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాల పార్కింగ్ మరియు నిర్వహణను పరిశీలించారు. ఇది కాకుండా, ఇతర ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులపై చర్చించారు.















