ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 10 :తెలంగాణలో నేడు(ఆదివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్,మంచిర్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.















