EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చిరుద్యోగి వైద్యానికి వెస్సో 50 వేల ఆర్దిక సహాయం

ఖమ్మం ఆగస్టు 10 (ఈ తరం భారతం);మియాపురం విజయ భాస్కరాచారి(51) ఖమ్మం నివాసి, గతంలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఉద్యోగం చేసేవారు. ఇటీవల ఆయన‌ గుండె జబ్బు తో నిమ్స్, హైదరాబాద్‌లో బైపాస్ శస్త్రచికిత్స చేయించు కున్నారు. దురదృష్టవశాత్తు శస్త్రచికిత్స అనంతరం ఆయనకు కుడి వైపు పక్షవాతం వచ్చింది. ఈ చికిత్స ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగినప్పటికీ, ఆయనకు ఆసుపత్రికి రెవ్యూకై తరచూ వెళ్లడం, అలాగే ఔషధాలు, ఫిజియోథెరపీ, ల్యాబ్ పరీక్షలు వంటి ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది! అనారోగ్య కారణంగా సంపాదనకు దూరమై వైద్య చికిత్సకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. VKFST ట్రస్ట్ సెక్రటరీ కందుకూరి మహేశ్వర ఆచార్య ద్వారా వెస్సో గురించి తెలుసుకొని, వారి సతీమణి శైలజ విజయ భాస్కరాచారి వైద్య చికిత్సకు ₹50,000/-ల ఆర్థిక సహాయం కోరారు. వెస్సో ట్రస్టీలు గౌరవ దాతల సహకారంతో విజయ భాస్కరాచారి కూతురు భవితకు 50,000/-ల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ అనుకోని అనారోగ్య సమస్యలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న భాస్కరచారికి ఆర్థిక సహాయం చేసి, వారు కోలుకునేందుకు సహాయపడిన గౌరవ దాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top