EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర

హైదరాబాద్ ఆగస్టు 11 (ఈ తరం భారతం);స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్ర, దేశభక్తి కార్యక్రమాల నేపథ్యంలో — తిరంగా యాత్రలు & హర్ ఘర్ తిరంగా వంటి దేశభక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు తెలిపారు. సోమవారం బిజెపి రాష్ట్ర కార్యల్కయం లో మీడియా సంమావేశం లో మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, గత 5 సంవత్సరాల నుంచి యావత్ భారతదేశంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది.ఇప్పుడు ఆరో సంవత్సరం హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా నిర్వహిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఒక కమిటీని నియమించడం జరిగింది.ఈ కమిటీ చైర్మన్‌గా బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి , సభ్యులుగా.. శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు , పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ , బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ చేవెళ్ల , ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఉన్నారు. వీరి నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు ర్వహించనున్నామని తెలిపారు..ఆగస్టు 14వ తేదీ వరకు తిరంగా ర్యాలీ, 14 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేయడం, ఆగస్టు 15 సాయంత్రం గౌరవప్రదంగా జెండాను అవనతం చేయడం జరుగుతుంది.అన్ని మండలాల్లో తిరంగా ర్యాలీ నిర్వహణ చేయాలని నిర్ణయించడం జరిగింది.ఆగస్టు 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ మీద దాదాపు 15 వేల మంది కాలేజీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.భారతదేశంలో భావితరాలకు స్వాతంత్ర్య చరిత్రను, అనేక మంది త్యాగాలను, విషాద గాథ చరిత్రను తెలియజేయడానికి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.ఆగస్టు 14, 2025వ తేదీన విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో ప్రదర్శనలు, హాల్ మీటింగ్లు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు..హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అన్ని మండలాల్లో జరగాలి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా తిరంగా యాత్రలో, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో పార్టీలు, కులాలు, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా దేశభక్తి భావనతో కార్యక్రమంలో పాల్గొనాలని రామచంద్రా రావు విజ్ఞప్తి చేసారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top