హైదరాబాద్ ఆగష్టు 11 (ఈ తరం భారతం ) రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థులు పీజుల టకాయిలు 6000 కోట్లు వెంటనే చెల్లించాలని BC-EBC విద్యార్థులకు పూర్తి పీఠాలు మంజురు చేయాలనీ, ప్రైవేట్ యూనివర్సిటీలలో SC/ST/BC రిజర్వేషన్లు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ సోమవారం వందలాది మంది విద్యార్థులు. రాష్ట్ర బి.సి విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ నాయకత్వం హైదరాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టదించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పోలీసు భారిబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఈ ముట్టడి కార్యక్రమానికి రాజ్య సభ సబ్యులు ఆర్. కృష్ణయ్య హాజరై ప్రసంగించారు.ముఖ్యమైన స్కాలర్ సిపి పీజు బకాయిలు, స్కీమును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు SC/ST/BC లకు అభివృద్ధికి ఉపయోగపడే ఈ స్కీమును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తుందని విమర్శించారు. అనేక స్కీములకు లక్షల కోట్ల అప్పు చేస్తున్ని ప్రభుత్వం లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిరెడ్డి ఈ పథకం కు ఒక 6000 కోట్లు అప్పు చేస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. పైగా ఈ పథకం కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో 20 రూపాయలు కూడా విడుదల చేయలేదని అన్నారు. ఈ పెదకం అమలుకు ఏటా నాలుగు శాఖల ద్వారా బడ్జెట్లో 5000 కోట్ల బడ్జెట్ కేటాయించి కూడా ఒక్క రూపాయి విడుదల చేయకుండా ల్యాప్స్ చేశాడు, కేంద్ర ప్రభుత్వం కూడా SC/ST లకు ఈ పథకం కింద వేల కోట్లు కేటాయిస్తుంది. వీటిని ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దఫాలుగా 1500 కోట్లు విడుదల చేశారు. కానీ మన రాష్ట్రంలో పీజులు, స్కాలర్షిప్లు, విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.ఈ స్కీమును సక్రమంగా అమలు చేయకపోవడం వలన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అందకారంలోకి పెట్టి వేయబడుతుంది. ఒకవైపు పీజు బకాయిలు చెల్లించకుండా ఇంకొక వైపు ఫీజుల స్కీములు ఎత్తివేయడానికి “ట్రస్ట్ బ్యాంకు” ఏర్పాటు చేసి దాని ద్వారా పీజులు చెల్లిస్తామని కొత్త నాటకం కు తెర లేపారని ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని దీనిని గట్టిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో సుదాకర్,నికిల్ పటేల్, చిక్కుడు బాలయ్య, నంద గోపాల్,మనిఖంట లతో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు
.















