EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో దిగజారిన శాంతి భద్రతలు…

ఈతరం భారతం  తెలంగాణ భవన్, బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం. ఆగస్టు 13 :కాంగ్రెస్ పాలనలో జిల్లాలో ఏర్పడ్డ దుర్భరమైన శాంతిభద్రతల పరిస్థితులపై ఖమ్మం జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు, ఎం ఎల్ సి తాతా మధుసూదన్  జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా భయంతో జీవిస్తున్న ప్రజలు – గతంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి.అనేక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఖమ్మం జిల్లా నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది – గంజాయి వ్యాపారం, పేకాట, చైన్‌స్నాచింగ్, వ్యభిచారం, దొంగతనాలు విపరీతంగా పెరిగాయి.దీనికి ఉదాహరణే– సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్, PNR డూప్లెక్స్ , బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్, బైపాస్ రోడ్‌లో దొంగతనాలు. శ్రీ శ్రీ సర్కిల్ లో గంజాయి బ్యాచిల ఆగడాలు……గంజాయి మత్తులో యువత వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి…….ముగ్గురు మంత్రుల వైఫల్యం – జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

పోలీసులపై అధిక వత్తిడి – మంత్రుల ప్రోటోకాల్ పనుల్లోనే పోలీసులు బిజీ, బిజి… పని భారంతో కుంగిపోతున్న జిల్లా అధికార యంత్రాంగం…..చెప్పుకోలేక కుంగిపోతున్న కుటుంబాలు…లాడ్జీలు, హోటళ్లు అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలుగా మారడం – పేకాట, గంజాయి, మద్యం, అనుచిత చర్యలు యదేచ్ఛగా జరుగుతున్నాయి.సుప్రీంకోర్టు తీర్పు దుర్వినియోగం – ప్రేమజంటల పేరుతో లాడ్జీల్లో అసభ్యకార్యకలాపాలు, వ్యభిచారం హద్దులేకుండా పెరుగుతున్నాయి……పోలీసుల నిఘా లోపం – లాడ్జీలు, పేకాట శిబిరాలపై గమనిక లేకపోవడం. కొంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు – సెటిల్‌మెంట్‌లు, రియల్ ఎస్టేట్ వివాదాలలో ఇన్వాల్వ్మెంట్… ఇది పరిస్థితి అని చెప్పారు.ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించకపోతే హెచ్చరిక – బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఖమర్, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య,నాయకులు ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బిచ్చల తిరుమలరావు, మక్బూల్, బలుసు మురళీకృష్ణ, పగడాల నరేందర్, లింగన్న బోయిన సతీష్, మహమ్మద్ రఫీ, చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top