ఈ తరం భారతం భువనగిరి ఆగస్టు 15 :ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆదేశానుసారం భువనగిరి పట్టణంలో నూతన కార్యాలయం ప్రారంభించి, అలాగే 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐవిఎఫ్ ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి హాజరై కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు.
కార్యాలయ ఆవరణంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఐవిఎఫ్ భువనగిరి వ్యవస్థాపకులు కుకుటపు చంద్రశేఖర్ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐవిఎఫ్ ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగాపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వయసు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఐవీఎఫ్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా భువనగిరిలో ఐ వి ఎఫ్ కార్యాలయం ఏర్పాటుకు సహకరించినటువంటి భువనగిరి పట్టణ ఐ వి ఎఫ్ వ్యవస్థాపకులు కుకుటపు చంద్రశేఖర్ అభినందించడం జరిగింది రానున్న రోజుల్లో ఐ వి ఎఫ్ బలోపితానికి తన వంతు సహకారం అందిస్తానని డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మరియు ఐ వి ఎఫ్ నాయకులు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు















