EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మహాత్ముల త్యాగ ఫలితమేనని స్వాతంత్ర దినోత్సవం         న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్

సంగారెడ్డి ఆగష్టు 15 (ఈ తరం భారతం); సదాశివపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ నినాదాలు తెలియజేశారు. ఈ సందర్భంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ స్వతంత్రం అనేది మహాత్ముల యొక్క స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలితమేనని కొనియాడారు, ఇట్టి స్వాతంత్రాన్ని పౌరులందరూ, ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రశ్నించే తత్వంతో అవినీతిని అంతం చేసే దిశగా, ప్రాంతాలను అభివృద్ధి పరిచే దిశగా ప్రయాణం కొనసాగించాలని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ ,ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ ,, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరన్న, కోల విజయ్, నాగేష్, అశోక్, బీసీ నాయకులు జావిద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top