EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పౌరులు కేంద్రంగా సుపరిపాలన అందించాలి : లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు -తుమ్మనపల్లి శ్రీనివాసు

హైదరాబాద్ ఆగస్టు 15 (ఈతరం భారతం );ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం లని పౌరులు కేంద్రంగా సుపరిపాలన అందినప్పుడే వారి త్యాగాలకు సార్ధకత లభిస్తుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జండాను ఎగరేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య ఫలాలు సామాన్యులకు దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేయ వలసి ఉందని ఆయన అన్నారు అందుకు 2047 కల్లా సమ్మిళిత ఆర్ధికభివృద్ధి 8 శాతానికి పైగా సాధించ్చాల్సివుందని అంతే కాకుండా నాణ్య మైన పాఠశాల విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ది, ఎన్నికల సంస్కరణలు, స్థానిక ప్రభుత్వాల సాధికారత, చట్టబద్ద పాలన, తెచ్చిన అప్పుల సద్వినియోగం వంటి కీలక అంశాలపై కాకుండా ఆయా పార్టీలు ఉచితాలు, తాయిలాలతో ప్రలోభాలకు గురిచేయడం మానుకోవాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిన పూనాలని ఆయన సూచించారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధక్షులు నందిపేట రవిందర్, కార్యదర్శులు మల్లాది కిషోర్, వంశీ ప్రసాద్, విద్యార్థి సత్తా ఇంచార్జ్ రాజీవ్, అరుణ్, సంతోష్, రాజు, శ్రీనివాసు, రాములు తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top