EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

క్యాష్ అవార్డు అందుకున్న భాను ప్రసన్న 

ఈతరం భారతం ఆగస్టు 15 :యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం కాచారం జడ్పీ హైస్కూల్లో గత సంవత్సరం 10వ తరగతి చదివి ప్రథమ స్థానం పొందిన ఎస్ భానుప్రసన్నకు రిటైర్డ్ ప్రొఫెసర్ కల్లూరి సోమిరెడ్డి 3 వేల రూపాయల క్యాష్ అవార్డును శుక్రవారం అందజేశారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హైస్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ సోమిరెడ్డి తమ తల్లి జ్ఞాపకార్ధంగా ఈ క్యాష్ అవార్డును భాను ప్రసన్నకు అందజేసి సత్కరించి అభినందించారు. ఈ ప్రాంతానికి చెందిన విద్యా రంగపు వ్యక్తిగా ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహించేందుకు క్యాష్ అవార్డును తమ తల్లి పేరిట అందజేస్తానని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి అత్యున్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ పద్మావతి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top