ఈ తరం భారతం.16.08.2025:పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం :మున్నేరు, పాలేరు రిజర్వయర్ ప్రాంతాలను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా & అర్డర్.
ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా ఖమ్మం మున్నేరులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట మున్నేరు, పాలేరు రిజర్వయర్ ప్రాంతాలను అడిషనల్ డీసీపీ లా & అర్డర్ ప్రసాద్ రావు సందర్శించి, పోలీస్ అధికారులను, స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీట మునిగిన రోడ్లు,వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపాల వేటాకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు,వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దనిసూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 సమాచారం ఆందిచాలని సూచించారు. వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసేలా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెరువులు,వరద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులకు సూచించామని తెలిపారు.















