ఈతరం భారతం ఆగస్టు 16 యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. గృహాలలో శ్రీకృష్ణ ప్రతిమలతో పూజలను జరిపారు. చిన్నారులు గొర్ల సుహర్షిత్, వస్తల్య, బింగి నిహాంత్, హాసిని, సాన్విక, హంశిక, కారుణ్య తదితరులు రాధాకృష్ణ, గోపికల వేషాలలో ఆకట్టుకున్నారు. పలుచోట్ల ఆనందోత్సాహాల మధ్య ఉట్ల వేడుకలు జరిగాయి. జిల్లా అంతటా కృష్ణాష్టమి సంబరాలు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ ప్రశాంతంగా జరిగాయి.















