EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదగిరిగుట్ట రీ _డెవలప్మెంట్ పనులకు రూ 56 కోట్లు శ్రీ గరుడ ట్రస్ట్, ఈ_ ఆఫీస్ ప్రారంభం

యాదగిరిగుట్ట,ఆగస్టు16 (ఈ తరం భారతం );: తెలంగాణలో ప్రముఖమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి శ్రీ యాదగిరి ఆధ్యాత్మిక మాస పత్రికను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఆలయ మర్యాదలతో దేవస్థానం వీరందరికీ స్వాగతం పలికింది .దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ మాదిరిగా ప్రారంభించిన శ్రీ గరుడ ట్రస్టును విరాళాల రూపేనా నిర్వహిస్తారు. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని శ్రీ స్వామివారి ప్రసాద వితరణకు, భక్తులకు ఉచిత వైద్య సేవలకు, అదే విధంగా సమీప పేద విద్యార్థుల ఉచిత విద్య, వైద్య సేవలకు డబ్బులు వినియోగిస్తారు. అయితే ట్రస్ట్ కు సంబంధించి టిక్కెట్ల విక్రయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ _ఆఫీసు ద్వారా దేవస్థానం కార్యాలయం పేపర్ లెస్ గా మారనుంది. డిజిటల్ విధానంలో పరిపాలన కొనసాగించనున్నారు.

రీ_ డెవలప్మెంట్ పనులకు రూ 56 కోట్లు

ఆలయ పునర్నిర్మాణం అనంతరం భక్తుల సౌకర్యాల కల్పనకు 56 కోట్ల రూపాయలను ప్రభుత్వం అనుమతించిందని దేవస్థానం తెలిపింది. ఈ డబ్బుతో రీ _డెవలప్మెంట్ వర్క్స్ చేయమన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు, సలహాదారు గోవింద చారి ,జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top