ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 17 : సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్, సోమాజిగూడ, హైదరాబాద్ నందు ఈ నెల 18 న ఫ్రీ మెగా సర్జికల్ కరెక్షన్ & హెల్త్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్ రెడ్డి , డిసేబుల్ ట్రస్ట్ సీఈఓ డా. విజయ్ భాస్కర్, డా. కీర్తన యాదవ్( నారి ఫౌండేషన్ ) నార్డోక సంయుక్త ప్రకటనలో తెలిపారు.ఉదయం 8:00 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ – హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో, డిసేబుల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్ పిట్టి ట్రస్ట్, డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్, రవి హీలియోస్ హాస్పిటల్, వికలాంగుల నెట్‌వర్క్, వికలాంగుల హక్కుల సాధన సమితి, FED మరియు జనజాగృతి ట్రస్ట్ శ్రీనివాస్ (వికలాంగుల చైర్మన్), కిరణ్ గుత్తికొండ (స్టేట్ ప్రెసిడెంట్ – డిసేబుల్ రైట్స్), యశోభ, నాగభూషణ్, వేను సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
ఈ శిబిరంలో అందించే సేవలు:
వికలాంగులకు ఉచిత శస్త్రచికిత్సలు
జనరల్ హెల్త్ చెకప్‌లు, డయాగ్నోస్టిక్ టెస్టులు, పోషకాహారం
కంటి పరీక్షలు మరియు ఉచిత కళ్లజోడు పంపిణీ
క్యాలిపర్స్, వీల్‌చైర్స్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ వాహనాల పంపిణీ చేస్తారు.
ఈ శిబిరాన్ని గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఉదయం 11:00 గంటలకు శిబిరాన్ని ప్రారంభిస్తారు.ప్రధాన అతిథులుగాకార్యక్రమానికి అధ్యక్షత వహించేది హరిచందన మేడం, కలెక్టర్, హైదరాబాద్,మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ,డానా కిషోర్ హాజరవుతున్నట్లు తెలిపారు.అందరు వికలాంగ సోదరులు మరియు సోదరీమణులు ఈ శిబిరానికి విచ్చేసి ఉచిత వైద్య సేవలు, సహాయక పరికరాలు అందుకోవాలని వారు కోరారు.















