EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పేద వధువు వివాహానికి వెస్సో సహాయం

హైదరాబాద్,ఆగస్ట్17 ఈ తరం భారతం : కుత్బుల్లాపూర్, సుభాష్ నగర్ నివాసి మసంగారు రామకృష్ణ చారి ఒక స్థానిక సంస్థలో హెల్పర్‌గా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రస్తుతం అద్దె లేని ఇంటిలో నివసిస్తూ, వాచ్‌మన్ గా సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య ఆ ఇంటి యజమాని వద్ద పని మనిషిగా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు సంతానం; పెద్ద కుమార్తె స్నేహ(23) వివాహం ఈ నెల 10 వ తేదీన హైదరాబాద్ లో జరిగింది. వరుడి కుటుంబం వివాహ ఖర్చులో సగభాగం భరిస్తామని అంగీకరించగా, మిగతా ఖర్చును వధువు కుటుంబం భరించవలసి ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, తన కుమార్తె వివాహ నిర్వహణ కు ఆర్థిక సహాయం చేయవలసినదిగా రామకృష్ణ చారి స్థానిక కుత్బుల్లాపూర్ సంఘ నాయకులను సంప్రదించారు. సంఘ నాయకులు వారి అభ్యర్థనను వెస్సో ట్రస్టుకు సిఫారసు చేయగా, వెస్సో ట్రస్టీలురామకృష్ణ చారి కి గౌరవ రాతల సహకారంతో 45,000/-ల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ స్నేహ వివాహానికి తగు ఆర్థిక సహాయం అందచేసి ఆశీర్వదించిన గౌరవ దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top