హైద్రాబాద్ ఆగస్ట్ 17.. ఈతరం భారతం :మేగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను తార్నాక లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్ బండి రమేశ్, శ్వెంకటేష్ గౌడ్, శ్సారంగపాణి, కిరణ్ (బీజేపీ రాష్ట్ర నాయకులు), కృష్ణవేణి, అమర్ తదితర కమిటీ సభ్యులు చురుకుగా పాల్గొని ఈ మహోన్నత సేవలో భాగస్వామ్యం అయ్యారు.ఈ సందర్భంలో నేతలు మాట్లాడుతూ, రక్తదానం ఒక ప్రాణరక్షక కర్తవ్యం అని, మరింత మంది ముఖ్యంగా యువత ఇటువంటి మానవతా కార్యక్రమాలలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమకారులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.భవిష్యత్తులోనూ సమాజ సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో తాము నిరంతరం భాగస్వామ్యం అవుతామని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ పునరుద్ఘాటించింది.















